మెగా లుక్ అదిరింది.. హాలీవుడ్ రేంజ్Ram Charan Varun Tej
2020-01-22 00:16:38

రోజురోజుకి టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నాం. ఆన్ లైన్ పుణ్యామా అని ఏది కావాలన్న చిటికెలో మన చెంతకు చేరుతోంది. ఇక సోషల్ మీడియా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బాధ, సంతోషం, దుఖం.. ఎలా ఏదొచ్చిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో మన గురించి అవతలి వాళ్లకు తెలిసిపోతుంది. ఇలా అరచేతిలో ప్రపంచం పెట్టుకొని చాలా వింతలు, విడ్డురాలు చేయొచ్చు. అలాగే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొబైల్ యాప్ లు కోకోల్లలు. అందులో ఒకటే ఫేస్ యాప్. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా..?

విషయంలోకి వెళ్తే.. వయసు మళ్లిన తరవాత మనం ఎలా ఉంటామో ఊహించడం కాస్త కష్టమే. కానీ అలాంటి ఓల్డేజ్ ఫేస్ ని మనం ముందే చూస్తే.. చాలా ఆసక్తిగా, గమ్మత్తుగా ఉంటుంది. అలా చూసుకోవాలంటే 'ఫేస్ యాప్' లో మన ఫోటో అప్ లోడ్ చేస్తే చాలు.. ఏ ఏజ్ లో మనం ఎలా ఉంటామో చూసుకొని మురిసిపోవచ్చు. ఇక్కడ కూడా అలాగే చేశారు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్. ఈ ఇద్దరి ఓల్డేజ్ లుక్ చూశాక వాహ్ అనడమే కాదు.. హాలీవుడ్ హీరోల్లా ఉన్నారనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్, చరణ్ కలిసి ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది.  

జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుణ్ కు కొంచెం డిఫరెంట్ గా విష్ చేశాడు. వరుణ్‌తో కలిసి గతంలో తాను తీసుకున్న ఒక ఫొటోను ఫేస్ యాప్ ద్వారా ఓల్డ్ లుక్ ఉన్న ఫొటోను తయారు చేశాడు చెర్రి. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..Happy birthday @varunkonidela7 !! Enjoy getting old😉!! అంటూ తమ ఓల్డెజ్ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో చూసిన మెగాభిమానులు.. చరణ్, వరుణ్ ఓల్డ్ లుక్‌లో అదిరిపోయారని.. హాలీవుడ్ హీరోల్లా ఉన్నారని మురిసిపోతున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే వరుణ్ తేజ్ ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో బాక్సర్ గా నటిస్తున్నాడు.

More Related Stories