సినీ నటుడు సునీల్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్సSunil
2020-01-23 12:42:33

ప్రముఖ సినీ నటుడు సునీల్ అస్వస్తతకు గురయ్యాడు. హీరోగా సినిమాలు మానేసి కమెడియన్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈయన. నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా.. అంతలోనే ఏమైంది అని కంగారు పడాల్సిన పనిలేదు. ఉన్నట్లుండి కాస్త అనారోగ్యానికి గురయ్యాడు సునీల్.

ప్రస్తుతం ఈయన మాదాపూర్ ఏ.ఐ.జి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండు రోజులుగా అక్కడే ఉన్నాడు ఈయన. లివర్‌తో పాటు గొంతు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు .  అయితే ఎలాంటి ప్రమాదం లేదని.. ఈయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యే అల వైకుంఠపురములో సినిమాలో నటించాడు సునీల్. ఇక ప్రస్తుతం కలర్ ఫోటో అనే సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

More Related Stories