ఉప్పెన ఫస్ట్ లుక్ విడుదల.. వైష్ణవ్ తేజ్ అదిరిపోయాడు..Uppena first look
2020-01-23 18:32:35

సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో ఈయన. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం.. పైగా ఈ చిత్రానికి కథ సుకుమార్ అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు.

తొలి సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు ఈ కుర్ర హీరో. తొలి సినిమానే అయినా కూడా చాలా అనుభవం ఉన్న నటుడిగా చేస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ. దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుంది. శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎప్రిల్ 2న విడుదల కానుంది ఈ చిత్రం.

More Related Stories