డిస్కో రాజా ట్విట్టర్ రివ్యూ... రవితేజ హిట్ కొట్టాడా...Disco Raja Review Rating.jpg
2020-01-24 08:20:48

ఒకప్పుడు రవితేజ సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం ఉండేది. కానీ రానురాను ఆ నమ్మకం పోగొట్టుకున్నాడు మాస్ రాజా. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఓవర్సీస్ టాక్ ఇప్పుడు బయటికి వచ్చింది. రవితేజ ముందు సినిమాలతో పోలిస్తే డిస్కో రాజాకు మంచి టాక్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ డ్రామా అయినా కూడా ఎక్కడా వినోదం తగ్గకుండా విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని తెలుస్తుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు తెరకెక్కించిన వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తీసుకొచ్చాడు. కాస్త ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా చెప్పే ప్రతయ్నం చేసాడు ఈయన.

ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి రవితేజ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇమేజ్ కి తగ్గట్లు బ్యాలెన్స్ చేస్తూ డిస్కో రాజా సినిమాను తెరకెక్కించాడు ఆనంద్. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసాడు మాస్ రాజా. ఆర్ఎక్స్ 100 సినిమాలో ముద్దులతో రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్.. తాన్యా హోప్.. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ న‌భా న‌టేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రవితేజ, బాబీ సింహా నటన సినిమాకు హైలైట్ అయిందని తెలుస్తుంది. ఈ చిత్రంలో మాస్ రాజా డ్యూయల్ రోల్ చేసాడు. సునీల్ కామెడీ సినిమాకు బలం. రవితేజకు ఇదే తొలి సైన్స్ ఫిక్షన్ కథ. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కించాడు విఐ ఆనంద్.

థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. మరి చూడాలిక.. మాస్ రాజా ఇండియాలో ఏం మాయ చేస్తాడో..?

More Related Stories