బీజేపీ ఆఫీసుకు అలీ...రాజకీయమేనాali
2020-01-24 18:37:35

టాలీవుడ్ స్టార్ కమెడియన్, వైసీపీ నేత అలీ ఉన్నట్టుండి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అది కూడా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం. దీంతో అలీ పార్టీ మారతారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే అసలు తాను బీజేపీ ఆఫీసుకు ఎందుకు వచ్చాననే అంశంపై అలీ స్పందించారు. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలోనే ఇండియా రాబోతున్నారని తెలిపిన అలీ ఆయన ప్రధాని మోదీని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వివరించారు. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను అలీ కోరారు. ఇందుకు  కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశంలో ఉన్న అలీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ అది కుదరక పోతే ఎమ్మెల్సీ-మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని బేషరతుగా పార్టీలో చేరానని చెప్పిన అలీ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అలీ అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. ఆయనకు నామినేటెడ్ పదవి లేదా ఫిలిం కార్పోరేషన్ పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ అవకాశం విజయ్ చందర్ ను వరించింది. ఈ నేపధ్యంలోనే అలీ బీజేపీ ఆఫీసుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే  ప్రకాష్ జవదేకర్ ను సినిమా లొకేషన్ అనుమతి కోసం కలిశానని అలీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది.  

 

More Related Stories