పవన్ కల్యాణ్ గారూ.. సినిమాలు చేయొద్దు సర్..pk
2020-01-26 02:47:49

అదేంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు కదా.. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలు చేయొద్దు అని ఎందుకు కోరుకుంటారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు కానీ ఏమాత్రం ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. ఆయన ఊ అంటే స్టార్ డైరెక్టర్లు వరుసగా కథలు సిద్ధం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చిన్న చిన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అవి కాస్త నిరాశ పరుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. గోపాల గోపాల ఏదో అలా నడిచింది అంతే. ఇక సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, కాటమరాయుడు సినిమాలు అత్యంత దారుణంగా డిస్ట్రిబ్యూటర్ లను ముంచేశాయి. ఇలాంటి సినిమాలు చేయడం కంటే కూడా సినిమాలు మానేసి హాయిగా రాజకీయాలు చేసుకుంటే నయం కదా అంటున్నారు అభిమానులు.

అనవసరంగా ఉన్న ఇమేజ్ పాడు చేసుకోవడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు కూడా మళ్లీ సినిమాల్లో చేస్తున్నాడు. పింక్ రీమేక్ చేస్తున్నా కూడా వేణు శ్రీరామ్ లాంటి దర్శకుడితో చేయడం నచ్చడం లేదు. ఆయన తర్వాత క్రిష్ అంటున్నారు. అలా పేరు లేని దర్శకులతో సినిమాలు చేస్తే అవి పోతున్నాయి.. అలాంటి సినిమాలు చేయడం అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఊరు పేరు తెలియని దర్శకులతో సినిమాలకు అనవసరంగా అవకాశాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా దారుణంగా మోసపోతున్నారు. క్రేజ్ ఉంది కదా 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే అవి కాస్తా 50 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త దృష్టి పెట్టి హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. లేకపోతే సినిమాలు పూర్తిగా మానేయాలంటూ సలహాలు ఇస్తున్నారు.

 

More Related Stories