హాట్ ఫోటోతో నెట్టింట రచ్చ రేపుతోన్న ప్రగతిPragathi Actress.jpg
2020-01-26 08:13:48

టాలీవుడ్ లో అమ్మ క్యారెక్టర్ లతో బాగా బిజీ అయిపోయిన ఒక సీనియర్ యాక్ట్రెస్ ఇప్పుడు హాట్ లుక్ లో అదరగొడుతోంది. హీరోయిన్లకు ధీటుగా ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ కేక పుట్టిస్తున్న ఆ లేడీ ఎవరా అనుకుంటున్నారా ? ఆమె ప్రగతి. టాలీవుడ్ యంగ్ హీరోలకు, హీరోయిన్స్ కి మదర్ గా నటిస్తున్న ప్రగతి అంటే తెలియని వారు ఎవరున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే ఈమె కామెడీ, సెంటిమెంట్ అని తేడా లేకుండా అన్ని పాత్రలను అవలీలగా పోషించి మెప్పించగలదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రోల్ లో మెప్పిస్తున్న ప్రగతి ఆన్ స్క్రీన్ లో క్యారెక్టర్స్ కు తగ్గట్లు కనిపిస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ గ్లామరస్ గా దర్శనమిస్తుంది. సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో అందంగా అలంకరించుకుని సూపర్ లుక్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తన కెరీర్ ఆరంభంలో పలు తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ప్రగతి పెళ్లి తర్వాత నటనకు మూడేళ్ళ పాటు గ్యాప్ ఇచ్చింది. తర్వాత సీరియల్స్ తో మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయ్యేంత వరకూ ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిజానికి తన వయసు ఉండే  హీరోలకు అమ్మగా నటించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రగతి అలా నటించడమే కాకుండా మెప్పిస్తుంది. ఈమధ్య  ప్రగతి సెక్సీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో భుజం పైన పచ్చబొట్టు స్లీవ్ లెస్ బ్లౌజ్- చీర ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. అద్దంలో వెనక భాగం కనిపించడం ఆ ఫోటోని మరింత హాట్ గా కనిపించేలా చేస్తోంది. ఇక గ్లామరస్ క్యారెక్టర్స్ వచ్చినా చేయడానికి సిద్ధంగానే ఉన్నా అన్నట్లు ఉన్న ఈ పిక్స్ చూసి అయినా ఆమెకి దర్శకులు హాట్ రోల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి.

More Related Stories