అమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన చిరంజీవి...Chiranjeevi Mother birthday.jpg
2020-01-30 14:04:44

మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎవరికైనా కూడా అమ్మంటే అంతే ప్రాణం. మెగాస్టార్ కూడా అంతే.. తన జీవితంలో ప్రతీ విషయాన్ని కూడా అమ్మతోనే పంచుకుంటాడు. అలాంటి మెగా మదర్ అంజనా దేవి పుట్టిన రోజు జనవరి 29. ఈమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంత పెద్దవాడు అయినా కూడా ఇప్పటికీ అమ్మ కనిపిస్తే చిన్న పిల్లాడు అయిపోతాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఫోటోలు చూస్తుంటేనే అది అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు చిరు. తల్లి అంజనా దేవి జన్మదిన వేడుకల్లో ఆమెతో కలిసి హాయిగా సెల్ఫీలు దిగాడు. సరదాగా కనిపించాడు.. నవ్వుతూ నవ్విస్తూ మారిపోయాడు చిరు.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ అంటే తనకు ఎంత ప్రేమ అనేది ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు కూడా. పైగా తన సినిమాలను కూడా తొలిరోజు అమ్మ అంజనా దేవిని తీసుకొచ్చి చూపిస్తాడు మెగాస్టార్. ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా కూడా అమ్మ కోసం అన్నీ వదిలేసి వచ్చాడు ఈయన. రోజంతా ఆమెతోనే సరదాగా గడిపాడు చిరు. తల్లితో సెల్ఫీ దిగుతూ ఉత్సాహంగా కనిపించాడు మెగాస్టార్. తల్లితో కేక్‌ కట్‌ చేయించాడు. ఈ వేడుకల్లో చిరు సతీమణి సురేఖతో పాటు నిహారిక, సుష్మిత సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

More Related Stories