హిట్ మూవీ టీజర్ టాక్hit
2020-02-01 11:47:41

విశ్వక్‌సేన్, రుహానీ శర్మ జంటగా నటిస్తూ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ సినిమా మీద  భారీ అంచనాలున్నాయి. అ సినిమాతో నిర్మాతగా మారిన నాని ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. త‌న వృత్తిలో భాగంగా ఎదురైన మొద‌టి కేసును చేదించేందుకు చేసే ప్రయత్నమే ఆ హిట్. ఫిబ్రవ‌రి 28న చిత్రం విడుద‌ల కానుండగా ఈరోజు టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. థ్రిల్లింగ్‌గా టీజ‌ర్ ఉంద‌ని అంటున్నారు.   ఒక ఛేజింగ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఓ మిస్సింగ్ కేసును చేధించడం ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ఒడిదుడుకుల ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టు టీజర్‌ని బట్టి అర్ధం అవుతోంది. 

 

More Related Stories