భీష్మ సాంగ్ విడుదల.. డాన్సులతో కుమ్మేసిన రష్మిక..nithin
2020-02-02 20:45:13

నితిన్, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా 'భీష్మ'. పెళ్లికి దూరంగా ఉండాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది. ఛలో సినిమా తర్వాత వెంకీ చేస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇఫప్ుడు మరో పాటను కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. వాటే బ్యూటీ అంటూ సాగే ఈ పాటలో రష్మిక మందన్న డాన్సులు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. రెండు రోజుల కింద టీజర్ విడుదల చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇది చూసిన తర్వాత సినిమాలో ఫుల్ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. ఈ పాట కోసమే అందమైన సెట్స్ కూడా వేసారు. నితిన్ కెరీర్ లోనే కాస్ట్ లీ పాట ఇదే. దీనికోసం దాదాపు కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. షూటింగ్ చివరిదశకు చేరుకుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి.

ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని మరో పాట విడుదలైంది.. 'వాటే బ్యూటీ' పేరుతో విడుదల అయిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన కొరియోగ్రఫీ అదిరిపోయింది.. కచ్చితంగా అభిమానులను అలరిస్తాయి. నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయని తెలిపాడు. 'భీష్మ' చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయని చెప్పాడు వెంకీ కుడుముల. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేసామని చెప్తున్నాడు ఈ దర్శకుడు. అలాగే అమ్మాయిలు కూడా రష్మిక కారెక్టర్ తో ప్రేమలో పడతారంటున్నాడు వెంకీ. మొత్తానికి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న భీష్మ ఆడియన్స్ ను మాయ చేస్తుందని ధీమాగా చెబుతున్నాడు వెంకీ కుడుముల.

 

More Related Stories