అలాంటి దాన్ని నేను చేసుకోను...బిగ్ బాస్ నటుడు సంచలనంbigg
2020-02-03 11:59:20

తెలుగులోనే కాదు బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని బాషలలో చాలా పాపులర్ అయింది. తమిళ్ లో అయితే అక్కడ ఈ షోను కమల్ హాసన్ హోస్ట్‌‌గా వ్యవహారిస్తుంటారు. అయితే ఆ షో ముగిసి చాలా కాలం అయినా ఇప్పుడు అది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తర్షన్‌పై నటి సనమ్ శెట్టి క్రిమినల్ కేసు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 3 అవకాశం రాకముందు నటి సనమ్ శెట్టితో కలిసి తర్షన్ సినిమాలో నటించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇంతలో బిగ్ బాస్ అవకాశం రావడంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక సనమ్ శెట్టితో వివాహానికి తర్శన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తర్శన్ మీద సనమ్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియా ముందు పలు ఆరోపణలు చేసింది. దీంతో దర్శన్ కూడా మీడియా ముందుకు వచ్చి ఆమె ప్రవర్తనపై సంచలన ఆరోపణలు చేశాడు. సనమ్ శెట్టి ప్రవర్తన సరిగా లేదని తాజాగా ఆమె తన పాత బాయ్ ఫ్రెండ్ తో ఒక రాంత్రంతా గడిపిందని ఆరోపించాడు. అలాంటి వ్యక్తిని తానెలా వివాహం చేసుకుంటానని ప్రశ్నిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పాడు.  

 

More Related Stories