కోర్టులో పిటిషన్ వేసిన దిల్ రాజు.. అసలు కారణం అదే..dil
2020-02-04 03:44:27

దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసాడు. నమ్మడానికి చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. దానికి బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఈయన పవన్ 26వ సినిమాను నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు ఈయన. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఎవరు పడితే వాళ్లు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ వీడియోలను లీక్ చేస్తున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా అది జరగడం లేదు. దాంతో నిర్మాతగా ఉన్న దిల్ రాజు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. ఇదే విషయంలో పవన్ కూడా దిల్ రాజుకు ఈ మధ్య క్లాస్ పీకాడని.. దయచేసి షూటింగ్ పిక్స్, వీడియోలు బయటికి రాకుండా చూసుకోవాలని రాజుకు సీరియస్ గా పవన్ చెప్పినట్లు తెలుస్తుంది. దాంతో ఈయన కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఆయన కోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు. పవన్ హీరోగా తాను నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కానీ ఎవరైనా సోషల్ మీడియాలో కానీ.. వెబ్ సైట్స్ లో కానీ అప్ లోడ్ చేస్తే కచ్చితంగా వాల్లకు న్యాయపరంగా శిక్షలు తప్పవని ఆయన పిటీషన్ లో పేర్కొన్నాడు.

అనుమతి లేకుండా షూటింగ్ సెట్స్ లోని ఫొటోస్, వీడియోలు ఎవరైనా తీసినా.. షేర్ చేసినా కూడా 5000 పాయల జరిమానాతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని దిల్ రాజు పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. రెండేళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో పింక్ రీమేక్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి షూటింగ్ తొలిరోజు నుంచే పవన్ సినిమాను లీక్ చేస్తున్నారు కొందరు. దాంతో దిల్ రాజుకు ఈ మాత్రం తప్పడం లేదు. ఈ లీకులపై పవన్ కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే లీగల్ యాక్షన్ కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్ లతో కూడా సినిమాలు కన్ఫర్మ్ చేసాడు పవర్ స్టార్.

More Related Stories