రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్‌నే ఫోకస్ చేస్తున్న రాజమౌళి..ntr
2020-02-04 11:58:32

ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. రాజమౌళి తీరు చూస్తుంటే నిజంగానే రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతుంది. అలా ఎందుకు అనే అనుమానం రావచ్చు.. కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపించకమానదు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ RRR సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అడవుల్లో ఎన్నో కష్టాల మధ్య ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. ఈ మధ్య హాలిడేస్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నారు. త్వరగానే మళ్లీ షూటింగులో జాయిన్ అయ్యారు ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పై రాజమౌళి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ముఖ్యంగా లుక్ విషయంలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. రామ్ చరణ్ ఈ మధ్య వేడుకల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. బయట పార్టీలకు కూడా బాగానే వస్తున్నాడు. దాంతో సినిమాలో ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోయింది. సైరా ప్రమోషన్స్ కోసం చాలా వరకు బయట కనిపించాడు మెగా వారసుడు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈయన లుక్ ఎలా ఉంటుందో అనేది మాత్రం ఇప్పటి వరకు పర్ఫెక్టుగా తెలియదు. చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందుకు రాలేదు. వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు. పైగా లుక్ లీక్ అయిన తర్వాత మరింత ఫోకస్ చేస్తున్నాడు ఈయన. ఆయన బయట కూడా వేడుకల్లో ఎక్కువగా కనిపించడం లేదు. దీన్నిబట్టి రాజమౌళి కేవలం నందమూరి మాత్రమే రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తి అయిపోయింది. 2021 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది.

More Related Stories