పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు..js
2020-02-04 12:12:32

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. మరోవైపు రాజకీయాలు కూడా చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అక్కడ కనిపిస్తున్నాడు పవర్ స్టార్. షూటింగ్స్ తో బిజీగా ఉన్నపుడు పవర్ స్టార్ గా కనిపిస్తున్నాడు కానీ అవసరం వచ్చినపుడు జనసేనాని కూడా బయటికి వస్తున్నాడు. అయితే ఈయన షూటింగ్ చేస్తున్న సమయంలోనే రోజూ ఏపీకి వెళ్ళి రాత్రి షూటింగ్ చేస్తున్నాడు. దీనికోసం భారీగానే ఆయన కోసం ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా నిర్మాత దిల్ రాజుకు పవన్ సినిమాతో తడిసి మోపెడు అవుతుందని వార్తలొస్తున్నాయి. స్పెషల్ ఫ్లైట్ ఈయన కోసం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇలాంటి సమయంలో పవన్ ప్లైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్. అన్నింటికంటే కీలకంగా పవన్ ఫ్లైట్ గురించే చెప్పుకొచ్చాడు నాదెండ్ల. రాజకీయాల్లో ఏ టైంలో ఎం జరుగుతుందో తెలియదు. నేను సడెన్ గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని పవన్ ముందే కండీషన్ పెట్టాడని చెబుతున్నాడు ఈ లీడర్. అలా అయితేనే సినిమాలు చేస్తానని పవన్ చెబుతున్నట్లు తెలుస్తుంది. అందుకే నిర్మాతలే ఆయన కోసం విమానం ఏర్పాటు చేసారు కానీ పవన్ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు అంటే అలాగే ఉంటాయని.. అవసరం ఉన్నపుడు అక్కడికి వెళ్లి రావడానికి విమానం ఉందని చెప్పాడు ఈయన. అయినా రోజులో 4 గంటలు మాత్రమే సినిమా కోసం ఇచ్చాడని చెప్పిన నాదెండ్ల.. మిగిలిన సమయం అంతా రాజకీయాలతోనే బిజీగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. అంతేకానీ పవన్ ను ఏమీ అనడానికి లేక ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ అంటున్నారని మండిపడుతున్నాడు ఈయన. మరి రోజులో కేవలం 4 గంటలతో ఈ ఒప్పుకున్న సినిమాలన్నీ పవన్ ఎప్పటికి పూర్తి చేయాలి..?

 

More Related Stories