చిరు, నాగ్ లతో భేటీ అయిన తలసాని...అందుకేchiru
2020-02-05 11:54:58

సినీనటులు చిరంజీవి, నాగార్జున లతో  తెలంగాణా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి విచ్చేసిన మంత్ర్రి చిరు నాగ్ లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగిందని చేబుతున్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధాన అమలు, శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ కు నైపుణ్యం పెంపుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు, చిత్రపురి కాలనీ లో హాస్పిటల్, పాఠశాల నిర్మాణం, చిత్రపురి కాలనీ ని వెంట సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయింపు, కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయింపు, Fdc తరపున సినీ, tv కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు అందే విధంగా సవరణ వంటి అంశాలను వీరు చర్చించినట్టుగా చెబుతున్నారు. Esi, గ్రూప్ ఇన్సూరెన్స్ లను అమలు, సినీ అవార్డుల ప్రధానం తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 2వ వారంలో మరోసారి సినీ ప్రముఖులు, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

 

More Related Stories