మెంటల్ ఎక్కిస్తున్న సురేష్ బాబు ఫార్ములా...Suresh Babu
2020-02-05 17:01:04

అందరిదీ ఒకదారి అయితే తనది మాత్రం వేరే దారి అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఎందుకంటే సక్సెస్‌ ఉన్న దర్శకుల వెంట పడడం నిర్మాతలకి అచ్చొచ్చే విషయం. ఎందుకంటే సక్సెస్‌లో వున్న దర్శకుడితో సినిమా చేస్తే ఈజీగా సేల్‌ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. కానీ సురేష్ బాబు లెక్క ప్రకారం సక్సెస్‌ ఇచ్చిన దర్శకులు మాట వినరు. నిజమే సక్సెస్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్పింది నిర్మాత వినాలని ఆ దర్శకుడు భావిన్చాచ్చు.

అదీ కాక హిట్‌ ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాలు పట్టించుకోక పోవచ్చు. అదీ కాక హిట్‌ దర్శకుడి రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. దాని వల్ల బడ్జెట్‌ కూడా చాలా పెరుగుతుంది. అందుకే సురేష్‌బాబు ఫ్లాప్‌ డైరెక్టర్లని మాత్రమే ఆదరిస్తున్నాడు. ఒక సారి తన  టాలెంట్ ప్రూవ్ చేసుకుని కాలం కలిసి రాక ఖాళీగా ఉన్న డైరెక్టర్‌ అయితే తాను కోరుకున్నట్టుగా సినిమా తీసుకునే వీలుంటుంది. అంతేకాక ఎలాగయినా హిట్‌ ఇవ్వాలనే కసితో ఆ దర్శకుడు కూడా పని చేస్తుంటాడు కాబట్టి అది కూడా తనకి కలసి వస్తుందని ఆయన లేక్కేసుకున్నాడు. అందుకే అసురన్‌ రీమేక్‌ చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించినా కానీ కనుమరుగైన శ్రీకాంత్‌ అడ్డాలకి ఛాన్స్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.  

More Related Stories