శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నిజంగా అంత రేటు పలుకుతుందా..kamal
2020-02-06 12:21:54

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుసు.. ఆయన ఒక్కో సినిమాకు ఎంత గ్యాప్ తీసుకుంటాడో తెలుసు. ఈయన సినిమాల్లో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు.. భారీతనం అస్సలు ఉండదు. సింపుల్ గా ప్రేమకథలతో పాటు తనకు నచ్చిన కథలను హృద్యంగా తెరకెక్కిస్తుంటాడు శేఖర్. అయినా కూడా ఒక్కో సినిమా కోసం దాదాపు రెండేళ్లు తీసుకుంటాడు శేఖర్ కమ్ముల. అదేంటని అడిగితే తాను అంతే.. అంత త్వరగా కథలు రాయలేని అని చెబుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఫిదా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. మూడు నెలల కింద కొత్త సినిమా మొదలు పెట్టాడు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటి వరకు ఈయన రొమాంటిక్ కామెడి, లవ్ స్టోరీ లు ఎక్కువగా చేసాడు.. కానీ తొలిసారి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. పల్లెటూరి నుంచి వచ్చి జీవితంపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన ఇద్దరి కథ ఈ సినిమా అంటున్నాడు శేఖర్ కమ్ముల. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడిగా నటిస్తున్నాడని.. ఆ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడని చెప్పాడు కమ్ముల. ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు లవ్ స్టోరీ టైటిల్ పెట్టాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా బిజినెస్ చూస్తుంటే నిజంగానే అందరికీ  పిచ్చెక్కిపోతుంది. చైతు గత సినిమాలతో పోలిస్తే లవ్స్టోరీ బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఫిదా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఏకంగా 5 కోట్లకు ఈ సినిమాను కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా.

More Related Stories