ప్రభాస్-రాజమౌళి మరో సంచలనం..prabhas
2020-02-07 03:20:41

టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కు తిరుగులేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి సంచలనాలు రేపిందో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రంతో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇక రాజమౌళి కూడా తన రేంజ్ పదింతలు కాదు వంద రెట్లు పెంచుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే దేశవ్యాప్తంగా సంచలనమే. ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ నుంచి మరో సంచలనం బయటికి రానుందని తెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బాహుబలి సినిమాను ఐదేళ్ల పాటు చేసిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు తమ ఇద్దరి కాంబినేషన్ లోనే ఓ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అంతేకాదు అందులో ఫస్ట్ సినిమా తమ కాంబోలోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి కాకుండా పక్కా కమర్షియల్‌ సినిమా చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే 2021 చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ కూడా జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణతో జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత తమ కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి ఆలోచించబోతున్నారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పకపోవచ్చు.

More Related Stories