పింక్ రీమేక్ టైటిల్ అదే..ఆరోజున ప్రకటన Pawan
2020-02-07 10:18:24

ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దాదాపు రెండేళ్ళ విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమా బాలీవుడ్ హిట్  `పింక్‌` ఆధారంగా రూపొందుతోంది. దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన నాటి నుండి లీకుల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ప‌వ‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు `లాయ‌ర్ సాబ్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు గతంలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. 

అయితే తాజాగా ఈ సినిమాకి `వ‌కీల్ సాబ్‌` అనే టైటిల్‌ని నిర్మాత దిల్‌రాజు రిజిస్ట‌ర్ చేయించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థ‌కు ఈ టైటిల్ క‌రెక్ట్ యాప్ట్‌గా వుంటుంద‌ని యూనిట్ భావిస్తోందని అంటున్నారు. టైటిల్‌ని, ఫ‌స్ట్‌లుక్‌ని ఉగాది రోజున‌ రివీల్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ఉగాది రోజున అనౌన్స్ చేస్తామ‌ని చెప్పిన దిల్ రాజు, మే 15న చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి మూవీకి సంబంధించి భారీగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్ట‌నున్నారని అంటున్నారు. మరి ఆ ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటారా ? లేదా అనేది తేలాల్సి ఉంది.

More Related Stories