నక్సలైట్ గా రామ్ చరణ్..naxlite
2020-02-11 14:47:24

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ గా మారనున్నాడా..? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి పక్కన పెడితే.. తాజాగా రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శతకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. చెర్రి నక్సైలైట్ రోల్ అంటున్నది కూడా మెగాస్టార్ సినిమాలోనిదే. ఇందులో నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉండే అత్యంత కీలకమైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసొడ్ లో చరణ్ నటిస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఆయన క్యారెక్ట్రర్ పేరు సిధ్దార్థ అని కూడా జోరుగా వినిపిస్తోంది. అలాగే ఇందులో చరణ్ 20నిమిషాల పాటు కనిపిస్తాడని టాక్. ఇకపోతే.. ప్రస్తుతం సిటీ ఔట్ కట్స్ లో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. చిరు సరసన త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు 'గోవింద ఆచార్య', 'ఆచార్య' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

More Related Stories