తాత అయిన వర్మ..ఆటపట్టించిన జక్కన్నRGV
2020-02-11 22:17:08

వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నాడా అని డౌట్ వస్తుంది. ఈ యేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో డాన్సులు గట్రా చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. 

తాజాగా రామ్ గోపాల్ వర్మ గురించి ఒక ఆసక్తికర వాత బయటకు వచ్చింది. అదేంటంటే ఇప్పుడు వర్మ తాత అయ్యారు. వర్మ కూతురు రేవతి వర్మ ఒక పాపకి జన్మనిచ్చింది. వర్మ కూతురుకి కూతురు పుట్టిన విషయాన్నీ రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా  షేర్ చేశారు. "రాము తాతయ్య గారికి కంగ్రాట్స్. మీ మనవరాలు మీ దూకుడుకి కళ్లెం వేస్తుంది అని ఆశిస్తున్నా. అవును ఇంతకీ మీకు ఎలా పిలిపించుకోవడం ఇష్టం... రాము తాత అని పిలవడమా లేక రాము నాన్న అనా, రాము గ్రాండ్ పా అన అని ట్వీట్ చేసి మరీ వర్మని ఆట పట్టించారు జక్కన్న. 

More Related Stories