టాలీవుడ్ కు మరో వారసుడు.. హీరోగా ఆ నిర్మాత కుమారుడు..DVV Danayya Son
2020-02-12 18:23:40

సముద్రంలో నీటి కొదవ లేదు... అన్నట్లుగా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు వెంటనే హీరోలు అయిపోతున్నారు వారసులు. దానికి తోడు ఇప్పటివరకు హీరోల తనయులు మాత్రమే ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఇప్పుడు దర్శక నిర్మాతల కొడుకులు కూడా హీరోలే అవుతున్నారు. ఇప్పటికే ఎందరో నిర్మాతల తనయులు ఇండస్ట్రీకి వచ్చారు.. ఇక ఇప్పుడు మరో నిర్మాత వారసుడు కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. 

ఆయన మరెవరో కాదు రాజమౌళితో ట్రిపుల్ ఆర్ లాంటి సంచలన సినిమా నిర్మిస్తున్న డి.వి.వి.దానయ్య కుమారుడు కళ్యాణ్. ఈయన తొలి సినిమా 2020 లోనే విడుదల కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'సాక్ష్యం' ఫ్లాప్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండే కథతో తన కుమారుడిని పరిచయం చేస్తున్నాడు డి.వి.వి.దానయ్య. 

అయితే ఈ సినిమాను ఆయన నిర్మించడం లేదు. ఆ బాధ్యతను మరో నిర్మాత అయిన భరత్ చౌదరికి అప్పగించాడు దానయ్య. ఈ సినిమాకి ఆయనే కథ, మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది. మరి దానయ్య వారసుడు హీరోగా సక్సెస్ అవుతాడా లేదా చూడాలి. 

More Related Stories