పెళ్లికి ముందు అలా చేస్తే తప్పే కాదు.. మహేష్ బ్యూటీkaira
2020-02-13 20:18:21

హీరోయిన్లకు బోల్డ్ స్టేట్మెంట్ లు కొత్తేం కాదు. గతంలో చాలా మంది హీరోయిన్లు సెక్స్ గురించి, డేటింగ్ గురించి చాలా బోల్డ్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బొంబాయి హాట్ బ్యూటీ కియారా అద్వాని చేసిన బోల్డ్ కామెంట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో పాటు.. రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించిన ఈ ముద్దుగుమ్మకి ప్రస్తుతం తెలుగులో కంటే.. బాలీవుడ్ లోనే  వరుస సినిమాలు చేస్తూ ఫుల్లు బిజీగా ఉంది.

రీసెంట్ గా ఒక సందర్భంలో డేటింగ్ గురించి తన మనసులో మాట చెప్పుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. అసలు పెళ్ళికి ముందే డేటింగ్ చేస్తే తప్పేలేదని చెప్పింది. పెళ్ళికి ముందే కలిసి తిరగడంలో తప్పులేదని, అలా చేస్తే ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడమే కాదు ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనే ఫీలింగ్ వచ్చిన తర్వాతే.. పెళ్లి చేసుకోవచ్చు.. అని చెప్పుకొచ్చింది అమ్మడు. ఇక ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని, ఎవ్వరితో రిలేషన్ లో లేనని చెప్పడం విశేషం. అయినా సింగిల్ ఉన్న నీకు ఉన్నట్టుండి.. డేటింగ్ గురించి ఎందుకంత ఆరాటం.. డేటింగ్ లో లేకపోతే ఇలాంటి కబుర్లు ఎందుకు చెబుతుందిలే.. అంటు సెటైర్లు వేస్తున్నారు సినిమా ఆకతాయిలు.

 

More Related Stories