వరల్డ్ ఫేమస్ లవర్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది..vijay
2020-02-17 14:30:46

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే అన్ని అర్జున్ రెడ్డి తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ దేవరకొండ. దర్శకులు కూడా విజయ్ ను అలాంటి పాత్రల్లోనే ఊహించుకుంటున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతుంది. ఇప్పుడు విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచేలా కనిపిస్తోంది. మూడు రోజులు కలిపి కేవలం 10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. మరో 12 కోట్లు వసూలు చేస్తే కానీ విజయ్ దేవరకొండ సినిమా విజయం అందుకోదు. పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం వీకెండ్ ముగిసిన తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ ప్రయాణం కూడా ముగిసేలా కనిపిస్తుంది. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా టాక్ మాత్రం ఊహించిన విధంగా రాలేదు. అది అర్జున్ రెడ్డి తరహా కథ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిప్పికొట్టారు. నిజానికి విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. దానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈయన సైన్ చేసిన సినిమాలు ఇవి. అప్పుడు విజయ్ దేవరకొండకు ఎలాంటి ఇమేజ్ కానీ మార్కెట్ కానీ లేదు. దాంతో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఒప్పుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో ఆలస్యంగా విడుదలయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇమేజ్ భారీగా పెరిగి పోవడంతో ఆ కథలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇమేజ్ పెద్దదైపోయి కథలు బాగా చిన్నగా మారిపోతున్నాయి. అందుకే ఇకపై ప్రేమకథలు చేయను అని చెప్పుకొచ్చాడు విజయ్. తన ఇమేజ్ తగ్గ కథ ఎంచుకుంటే తప్ప ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండ కెరియర్ సెట్ అవ్వదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories