ఊపిరి సలపలేనంత బిజీగా పవన్ కళ్యాణ్pk
2020-02-18 08:07:08

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వేగంగా సినిమాలు ఒప్పుకున్నారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేయడమే కాక ఏ మాత్రం బద్దకించకుండా షూటింగుల్లో కూడా పాల్గొంటూ మరోపక్క రాజకీయాలు చేసుకుంటున్నాడు. పింక్ రీమేక్ వకీల్ సాబ్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ అలాగే క్రిష్ డైరెక్షన్ లో సినిమా షూటింగ్ అంటూ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20 నుంచి అంటే ఎల్లుండి నుండి అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ హీరోగా, బోని కపూర్, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరగనున్నట్టు చెబుతున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో కోర్టు సీన్లు ఈ నెల 30 వరకు షూట్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని కూడా గతంలో ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఈ షూట్ ఎందుకో ?. అయితే ఈ నెల 30 వరకు వకీల్ సాబ్ షూట్ చేయనున్న పవన్ మళ్ళీ మార్చి 1నుంచి మార్చి 20 వరకు క్రిష్ సినిమా షూటింగ్ లో గడపనున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పింక్ రీమేక్ మూడో షెడ్యుల్ మార్చి 20 నుంచి జరుగనుంది. 

More Related Stories