హిట్ ట్రైలర్ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా.. HIT
2020-02-19 15:45:18

ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ఈయన హీరోగా ఇప్పుడు నాని హిట్ సినిమాను నిర్మించాడు. పిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ కేస్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు అనిపిస్తుంది. 

అమ్మాయి మిస్సింగ్.. మర్డర్ మిస్టరీ చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు శేలేష్ కొలను. నాని కూడా ఈ సినిమా కథతో ప్రేమలో పడిపోయాడు. కచ్చితంగా హిట్ సినిమాతో హిట్ కొట్టి చూపిస్తానంటున్నాడు. అ.. సినిమా తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాని. డాక్టర్ శైలేష్ చెప్పిన కథ నచ్చడంతో తన ప్రొడక్షన్ లోనే హిట్ సినిమాను తీసుకొస్తున్నాడు. 

నాని ఫ్రెండ్ ప్రశాంతి ఈ సినిమాకు నిర్మాత. ఇదిలా ఉంటే ట్రైలర్ చూస్తుంటే పూర్తిగా అమ్మాయి మిస్సింగ్ కేస్.. డ్రగ్స్ వ్యాపారం.. ఓ పోలీస్ ఆఫసీర్ చేధించే కేస్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అంతా ఆసక్తికరంగానే సాగింది. ఫలక్ నుమా దాస్ సినిమాతో యావరేజ్ దగ్గరే ఆగిపోయినా ఈ సారి మాత్రం హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు విశ్వక్ సేన్. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నాడు నాని. దిశ కేసులో చూసినట్లుగానే టోల్ గేట్.. మిస్సింగ్.. మర్డర్ ఈ సినిమాలోనూ ఉన్నాయి. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?

More Related Stories