వంశీ పైడిపల్లి సినిమాపై ఆలోచనలో పడ్డ మహేష్ బాబు..Mahesh Babu
2020-02-22 18:11:48

మహేష్ బాబుతో సినిమా కమిటైన తర్వాత దర్శకులకు నిద్ర పట్టడం లేదు. ఒకప్పుడు ఈయనతో సినిమా కమిట్ అయితే పూర్తయ్యే వరకు టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మధ్యలోనే మనసు మార్చుకుంటున్నాడు సూపర్ స్టార్. ముఖ్యంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సినిమాలను కూడా చెప్పా పెట్టకుండా ఆపేస్తున్నాడు. సుకుమార్ సినిమాను ఆ మధ్య అలాగే ఆపేసి అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు ఈయన. 

ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాను కూడా హోల్డ్ లో పెట్టేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈయన తర్వాతి సినిమా అతడితోనే అంటూ వార్తలొస్తున్నాయి. మహేష్, వంశీ కూడా తమ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. మే నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని మహేష్ చెప్పాడు. అంతలోనే వంశీ సినిమా ఆలస్యం కానుందని ప్రచారం జరుగుతుంది. సినిమా అనుకున్నట్లుగా మే నుంచి కాదు ఇంకా చాలా లేట్ అవుతుందని తెలుస్తుందిప్పుడు. 

దీనికి కారణం కథలో లోపాలు. వంశీ పైడిపల్లిని మహేష్ బాబు అడిగిన కొన్ని అనుమానాలు సినిమా ఆలస్యానికి కారణమని తెలుస్తుంది. ఆ అనుమానాలు తీర్చాలంటే కథలో కొన్ని మార్పులు చేయక తప్పదని తెలుస్తుంది. అందుకే మరికొన్ని రోజులు స్క్రిప్ట్ పై కూర్చోవాలని చూస్తున్నాడు వంశీ. అసలే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సూపర్ స్టార్ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఇప్పుడు వంశీ పైడిపల్లికి మరిన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు.

More Related Stories