నక్క తోక తొక్కిన వంశీ పైడిపల్లి...మహేష్ సినిమా పోగానే...Vamshi Paidipally.jpg
2020-02-23 09:22:38

టాలీవుడ్ లో గత రెండ్రోజులుగా సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాతో తప్పిపోయింది అనుకునే లోపు మరో స్టార్ హీరోతో సినిమా వర్కౌట్ అయ్యింది. ఫారిన్ టూర్ కి వెళుతూ తిరిగొచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తానని  వహించనున్న సినిమా కోసం రంగంలోకి దిగుతానని చెప్పాడు మహేష్. `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో వచ్చిన విజయాన్ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుని ఇటీవలే వచ్చేశాడు. ఇక వెంటనే సినిమా మొదలు పెడతారు అనుకునే లోపు ఆ కాంబినేషన్ గురించి రకరకాల ర్రోమర్స్ వినిపిస్తున్నాయి.

మహేష్ -వంశీ పైడిపల్లి కలయికలో సినిమా ఆగిపోయిందని, పరశురామ్ చెప్పిన కథకి ఓకే చెప్పేశాడనే గుసగుసలు రెండు రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా ఆగిందనే వార్త వినిపించగానే మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సుకుమార్ లూసిఫర్ రీమేక్ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వంశీ చేతికి వచ్చిందని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాతో పాటు ఈ సినిమా కూడా చేయాలని చిరు భావిస్తున్నాడట. అంతే కాక చరణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి దాని రిలీజ్ డేట్ కూడా లాక్ చేసినట్టు చెబుతున్నారు.

అందుతున్న సమాచారం మేరకు కొరటాల సినిమా వాయిదా పడవచ్చు. ఆ సినిమా కంటే ముందే లూసిఫర్ రీమేక్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా స్క్ర్పిట్ మొత్తం సుకుమార్ అండర్ లో తయారు అయ్యిందని అంటున్నారు.

More Related Stories