వెంకటేష్, నాగార్జున వియ్యంకులు కాబోతున్నారా..nag venky
2020-02-24 16:39:45

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కు వెంకటేష్ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు మరింతగా ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా అఖిల్.. వెంకటేష్ కు వరుసకు అల్లుడు అవుతాడు.. ఆ వరుసలు కలిపేస్తే సొంత అల్లుడు అయిపోతాడు కదా అని అంటున్నారు నెటిజన్లు. 

వెంకటేష్, నాగార్జున సొంత బంధువులే. చాలా ఏళ్ల క్రితమే ఈ రెండు కుటుంబాలు ఒక్కటైపోయాయి. 1984 సమయంలో దగ్గుబాటి రామానాయుడు తన కుమార్తె లక్ష్మిని.. అక్కినేని నాగేశ్వరరావు రెండో కుమారుడు నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కొన్నేళ్ళ పాటు కలిసి ఉన్న వీళ్ళు అనుకోని కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున జీవితంలోకి అమల వచ్చింది. ఆ వెంటనే రామానాయుడు కూతురు లక్ష్మి కూడా మరొకర్ని పెళ్లి చేసుకుంది. ఇలా వెంకటేష్.. నాగార్జున బావ బామ్మర్దులు. అయితే వెంకటేష్ చెల్లెలకి నాగార్జున విడాకులు ఇచ్చినా కూడా వీరిద్దరి మధ్య స్నేహ బంధం మాత్రం అలాగే ఉండిపోయింది. 

కానీ అఖిల్ తో వెంకటేష్ కూతురు పెళ్లి అయితే అప్పుడు చెడిన బంధం ఇప్పుడు మళ్లీ ఒకటి అవుతుందని.. అది చనిపోయిన రామానాయుడు కోరిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఖిల్ అక్కినేని పెళ్లి వెంకటేష్ కుమార్తెతో జరగటం అంత మంచిది కాదని కొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున అలా దగ్గుబాటి కుటుంబంతో బంధం కలుపుకొని వెంటనే విడాకులు తీసుకున్నాడు. పైగా అఖిల్ అక్కినేని కి ఇప్పటికే ఒకసారి నిశ్చితార్థం పై క్యాన్సల్ అయింది. 

ఇలాంటి సమయంలో  వెంకటేష్ కుటుంబంతో నాగార్జున కుటుంబం మరోసారి వియ్యము పొందడం అంత మంచిది కాదు అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరి కొందరు అభిమానులు మాత్రం అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్లీ బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ అఖిల్ పెళ్లిని సమర్ధిస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
 

More Related Stories