పవన్ ను కలిసిన భీష్మ టీమ్pk
2020-02-25 03:56:22

నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఫిబ్రవరి 21న శివరాత్రి సందర్భంగా రిలీజయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరో నితిన్, దర్శకుడు వెంకీ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈరోజు సాయంత్రం పవన్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. తన అభిమానాన్ని నితిన్ చాలా సార్లు బయట పెట్టుకున్నాడు. ఇక నితిన్ పవన్ కళ్యాణ్ ని కలవడంతో ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

More Related Stories