నానితో మరో సారి మల్లూ బ్యూటీnani
2020-02-26 02:24:21

నాచురల్ స్టార్ నాని నిన్ననే తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే టైటిల్ తో ఈ సినిమాని టాక్సీవాలా ఫేం దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నానికి 27వ సినిమా. అయితే నిన్న ఈ సినిమా ప్రకటన అయితే చేశారు కానీ ఈ సినిమాలో నానితో నటించేది ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే నాని సరసన నటించేది ఎవరా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో నాని సరనస నటించేది సాయి పల్లవి అని అంటున్నారు. ఇప్పటికే ఆమెతో చర్చించారని అయితే ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అంటున్నారు. ఎంసీఏ సినిమాలో కలిసి నటించిన నాని, సాయి పల్లవి జంట మరోసారి కనువిందు చేయబోతుందని అంటున్నారు. ఈ విషయం మీద కొన్ని రోజులలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్నారనే విషయం తేలితే సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. 

More Related Stories