ఐదో సారి జంటగా ఎన్టీఆర్ - సమంతాNTR Samantha.jpg
2020-02-26 17:07:47

త్రివిక్రమ్ తో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో… ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు మూడో సినిమాకి కూడా త్రివిక్రమ్ పూజాహెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత రష్మిక ను తీసుకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని అందుకే ఒక హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారని వార్తలు మొదలయ్యాయి. ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో వచ్చే ఐదో సినిమా అవుతుంది.

బృందావనం సినిమాతో మొదట స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత రభస, ‘రామయ్య వస్తావయ్యా’ ఆతర్వాత జనతా గ్యారేజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు చేశారు. రభస, రామయ్యా వస్తావయ్యా సినిమాలు కాస్త దెబ్బెసినా మిగతా సినిమాలు బంపర్ హిట్ గా నిలిచాయి.

More Related Stories