కుర్రాళ్లకు ప్రభాస్ వరాలు... ఇప్పుడు నాగ్ అశ్విన్‌తో...Prabhas.jpg
2020-02-26 21:58:14

ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకులను కూడా ఈజీగా నమ్మేస్తున్నాడు ప్రభాస్. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ తో వరస సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు కుర్రాళ్లకు వరాలిచ్చేస్తున్నాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాను కన్ఫర్మ్ చేసాడు ప్రభాస్. ఐదేళ్ల కింద ప్ర‌భాస్ తో సినిమా అంటే ద‌ర్శ‌కులు పెద్ద‌గా భ‌య‌ప‌డేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా అంటే వణికిపోతున్నారు. దీనికి కార‌ణం బాహుబ‌లి. ఎందుకంటే అప్పుడు ప్ర‌భాస్ స్టార్ మాత్ర‌మే.. 1000 కోట్ల హీరో. ఇండియా మొత్తం తెలిసిన మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ప్ర‌భాస్. అలాంటి హీరోతో సినిమా అంటే ఏ ద‌ర్శ‌కుడికైనా సాహ‌స‌మే. పైగా బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌చ్చే సినిమా అంటే అంచ‌నాలు కూడా అవే స్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవ‌డం అంటే ఆకాశానికి నిచ్చెన వేయ‌డ‌మే.

అయినా కూడా ఈ ఛాలెంజ్ తీసుకుని సగం సక్సెస్ అయ్యాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది. తెలుగులో ఫ్లాప్ అయింది. ఇప్పుడు జిల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రాధాకృష్ణ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఆయ‌న చెప్పిన క‌థ‌కు ప్లాట్ అయిపోయిన ప్ర‌భాస్.. సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా ఓకే చేసాడు. ఇందులో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. వ‌చ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ గోపీకృష్ణ బ్యాన‌ర్ తో పాటు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 ఇప్పుడు ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. 'మహానటి' లాంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాన్ని రూపొందించిన్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. సి. అశ్వినీదత్ సమర్పించే ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించనున్నారు. వైజయంతీ మూవీస్‌ను అశ్వినీదత్ ప్రారంభించి 49 ఏళ్లు నిండి 50వ ఏట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాను అనౌన్స్ చేసారు వాళ్లు. నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రం వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ కుర్ర దర్శకులకు బాగానే ట్యూన్ అవుతున్నాడు.

More Related Stories