విక్రమ్ కే కుమార్ పరిస్థితి ఏంటిప్పుడు.. నెక్ట్స్ ఎవరితో..vikram
2020-02-29 14:02:34

విక్రమ్ కే కుమార్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రశంసలు మాత్రం దక్కించుకుంటాయి. కానీ ఫస్ట్ టైమ్ ఆయన కెరీర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాప్ తో పాటు విమర్శలు కూడా తీసుకొచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులకు వచ్చిన అనుమానం అసలు ఇది విక్రమ్ తీసాడా లేదంటే ఎవరైనా తీసి ఆయన పేరేసారా అని. లేకపోతే మరేంటి.. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాలు చేసిన ఈయన గతేడాది గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చాడు. టైటిల్ లోనే పవర్ ఉంది కానీ కథలో మాత్రం లేదంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా విక్రమ్ కే కుమార్ సినిమాలను అభిమానించే వాళ్లకు మాత్రం గ్యాంగ్ లీడర్ తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే రొటీన్ కథలు తీసుకున్నా కూడా దానికి తన మార్క్ స్క్రీన్ ప్లే అద్ది ఔట్ స్టాండింగ్ అనిపిస్తాడు విక్రమ్.

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కూడా ఇదే చేస్తాడని అనుకున్నారు ఆడియన్స్. కానీ దీనికి పరమ రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకుంటాడని మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదు. లెక్కలేసుకుని తీసినట్లు.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అంతా మన కళ్ల ముందు కనిపిస్తున్న క్షణాన విక్రమ్ కే కుమార్ స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయింది. దాంతో ఆడియన్స్ లో నిరాశ కూడా తప్పలేదు. ముఖ్యంగా విక్రమ్ లాంటి బ్రిలియంట్ దర్శకుడి నుంచి గ్యాంగ్ లీడర్ లాంటి రొటీన్ స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు ఊహించలేదు. దాంతో ఈ సినిమా తర్వాత ఏంటి అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. రామ్ చరణ్ కు కథ చెప్పే పనిలో ఉన్నాడని వినిపిస్తుంది కానీ అందులో నిజమెంతో తెలియడం లేదు. మొత్తానికి చూడాలిక.. టాలెంటెడ్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు ఖాళీ డైరెక్టర్ అయిపోయాడు.

More Related Stories