హిట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్Hit Movie
2020-02-29 19:01:58

మూడేళ్ల కింద అ.. సినిమాతో నిర్మాతగా మారిన ఇప్పుడు హిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదీ ఫలక్‌నుమా దాస్ లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటించాడు. కాప్ డ్రామాగా నిన్న ప్రేక్షకుల వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. హిట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 4.40 కోట్ల మేరకు జరిగింది. విశ్వక్ సేన్ ఇంకా ఎస్టాబ్లిష్ కాని హీరో కాదు కాబట్టి నిన్న మొదటి రోజున ఏపీ, తెలంగాణలో వసూళ్లు ఓ మాదిరిగా కనిపించాయి. ఈ సినిమా మొదటిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. కోటికిపైగా వసూలు చేసినట్టు చెబుతున్నారు. 

తొలి రోజున పాజిటివ్ టాక్ కొంత కనిపించడంతో రెండో రోజున సినిమా కలెక్షన్లు పెరగడానికి అవకాశాలున్నాయి, అది కూడా ఇది వీకెండ్ కాబట్టి ఇంకా పెరగచ్చు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం నైజాంలో రూ.67 లక్షలు, సీడెడ్‌లో రూ.13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ.15.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.8 లక్షలు, నెల్లూరులో రూ. 3.5 లక్షలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1.32 కోట్లు రాబట్టినట్టయింది.

More Related Stories