జయసుధ ఇంట పెళ్లి వేడుక...అండగా నిలబడిన టాలీవుడ్jaya
2020-03-01 18:52:02

సహజ నటి జయసుధ పెద్ద కొడుకు నిహార్ కపూర్ రిసెప్షన్ నిన్న ఘనంగా జరిగింది. ఈయన వెడ్డింగ్ రిసెప్షన్‌కు తెలుగు ఇండస్ట్రీ నుండి అతిరధ మహారధులు హాజరయ్యారు. పవన్, బాలయ్య, నాగార్జున, చిరంజీవి సహా చాలా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో కనిపించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నిజానికి నిహార్ పెళ్లి ఈ నెల 26న ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత కౌర్‌ తో వివాహం జరిగింది. వివాహం ఢిల్లీలో జరగడంతో తెలుగు సినీ ప్రముఖుల కోసమే రిసెప్షన్ నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. నిన్న సాయంత్రం పార్క్ హయత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకి నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టి.సుబ్బరామిరెడ్డి, మురళీ మోహన్‌, నరేష్‌ తదితరులు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి,టీడీపీ అధినేత చంద్రబాబులకు కూడా ఆహ్వానం అందించినప్పటికీ వారు ఎందుకో ఏమో హాజరుకాలేదు. ఇక తన కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ లో జయసుధ అందరినీ పలకరిస్తూ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు.  

 

More Related Stories