అందరికీ ముద్దులు పెట్టేస్తున్న అనసూయ భరద్వాజ్..anasuya
2020-03-02 14:28:22

అదేంటి.. అలా ముద్దులు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు అనసూయ ఇదే చేస్తుంది మరి. బుల్లితెర‌ను త‌న అందాలతో త‌డిపేసిన బ్యూటీ అన‌సూయ‌. అప్ప‌టి వ‌ర‌కు యాంక‌ర్ అంటే ప‌ద్ద‌తిగా ఉండాలి.. చీర‌క‌ట్టులో క‌నిపించాలనే రూల్స్ కు బ్రేక్ చెప్పింది ఈ బ్యూటీ. పెళ్లి త‌ర్వాత యాంక‌రింగ్ లోకి వ‌చ్చిన అన‌సూయ‌.. మిగిలిన యాంక‌ర్లు అసూయ ప‌డేలా ఎదిగిపోయింది. అన్నింటికీ అందాల‌నే పెట్టుబ‌డిగా పెట్టేసింది. అందాల ప్ర‌ద‌ర్శ‌నలో మాత్రం ఇప్ప‌టి హీరోయిన్లు కూడా ప‌నికిరారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి.. వ‌య‌సు ఉండ‌గానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేన‌కేసుకోవాలి.. ఆ క్రేజ్ కాస్తా పోయిందంటే చూసేవాళ్లు కూడా ఉండ‌రు. ఇదే ఇప్పుడు అన‌సూయ ఫాలో అవుతోన్న రూట్. ఈ భామ‌కు తెలుసు.. జీవితంలో తాను ఎప్ప‌టికీ స్టార్ హీరోయిన్ అవ్వ‌న‌ని. అందుకే ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది ఈ భామ‌. సింపుల్ గా హీరోయిన్ల‌కు ధీటుగా హాట్ ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తోంది అను ఆంటీ.

పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైన త‌ర్వాత కూడా హాట్ షోకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా ఇర‌గ‌దీస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య అన‌సూయ ఓ హాట్ ఫోటోషూట్స్ చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రతీ చిన్న అప్ డేట్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. అందుకే ఇప్పుడు ఆమెకు ఏకంగా 1 మిలియన్ ఫాలోయర్స్ వచ్చేసారు. దాంతో తన ట్విట్టర్ కుటుంబానికి ముద్దులు పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న అభిమానులకు నా ముద్దులు అంటూ ఫోటో షేర్ చేసింది అను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తా అనే రేంజ్ లో త‌న హాట్ షోతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హింట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే వరస సినిమాలతో రచ్చ చేస్తుంది అనసూయ. ఈ మధ్యే ఈమె నటించిన కథనం సినిమా డిజాస్టర్ అయింది. మొత్తానికి అన‌సూయ తాను హీరోయిన్ లా ఫిక్సైపోయిందన్న‌మాట‌. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోయర్స్ అంటే మాటలు కాదు.

More Related Stories