చిరంజీవిని ఏమైనా అంటే చంపేస్తాం.. బ్రహ్మాజీ వార్నింగ్..Brahmaji
2020-03-02 12:22:23

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏమో గానీ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాత్రం మళ్లీ ఆయనకు అందరూ సపోర్ట్ గా నిలిచారు. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా చిరంజీవికి సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత అన్నయ్య అన్నయ్య అంటూ అందరూ ఆయన చుట్టూ చేరుతున్నారు. 

ముఖ్యంగా ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ హీరోగా తెరకెక్కిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఉత్తేజ్, సునీల్ ఇలాంటి వాళ్లు మాట్లాడిన మాటలు చూస్తుంటే చిరంజీవి అంటే వాళ్లకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఉత్తేజ్ 5 పేజీల ప్రశంసా పత్రం రాసుకొని వచ్చాడు. అది విన్న తర్వాత చిరంజీవి కూడా ఆకాశంలో తేలిపోయాడు. తనను ఇక్కడికి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారని.. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది తన సన్మాన సభ అని చమత్కరించాడు మెగాస్టార్. ఇక ఇదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ మాట్లాడుతూ చిరంజీవి అంటే తమకు ప్రాణం అని తెలిపాడు.

ఆయన కేవలం మెగా ఫ్యామిలీకి మాత్రమే పెద్దదిక్కు కాదని.. ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పుడు ఆయనే పెద్ద అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు ప్రస్తుతం అందరూ ఆయన నీడలోనే ఉన్నారు అంటూ తెలిపాడు బ్రహ్మాజీ. అలాంటి చిరంజీవిని ఎవరైనా ఒక్క మాట నోరెత్తి మాట్లాడిన.. వేలెత్తి చూపించిన కచ్చితంగా వాళ్లను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు బ్రహ్మాజీ. చిరంజీవి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని.. అలాంటి వాళ్లను గౌరవించడం తప్ప వేలెత్తి చూపించకూడదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బ్రహ్మాజీ. 

ఈమధ్య చిరంజీవి ఇంటిని అమరావతి రైతులు ముట్టడించడం.. ఆ విషయాన్ని బాగా రాజకీయం చేయడంతో మరోసారి మెగాస్టార్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు బ్రహ్మాజీ వాళ్లని ఉద్దేశించి అన్నాడా.. లేదంటే ఇండస్ట్రీలో చిరంజీవికి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్లను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా చిరంజీవి సినిమాలు మొదలు పెట్టిన తర్వాత మళ్లీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. 

More Related Stories