బంపర్ ఆఫర్ కొట్టేసిన కరుణకుమార్Palasa 1978
2020-03-05 15:37:04

మొదటి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమాకు ఆఫర్ వస్తే? అది కూడా గీతా ఆర్ట్స్ వంటి సంస్థలో అల్లు అరవింద్ వంటి మెగా నిర్మాత పిలిచి భుజం తట్టి అడ్వాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఆయన నేల మీద ఉంటాడా ? ఇప్పుడు పలాస 1978 చిత్రాన్ని తెరకెక్కించి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దర్శకుడు కరుణ కుమార్ పరిస్థితి అదే. 

ఎందుకంటే మెగా నిర్మాత అల్లు అరవింద్ నిన్ననే పలాస 1978 సినిమా చూసి నచ్చేయడంతో దర్శకుడ్ని పిలిచి తన బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిందిగా కోరడమే కాక అక్కడికక్కడే చెక్ కూడా రాసి ఇచ్చేశారు. లండన్ బాబులు అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రక్షిత్ హీరోగా సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రూపొందిన ఈ సినిమారేపు విడుదల కానుంది. ఈ సినిమాలో రఘు కుంచె విలన్ గా చేసి మ్యూజిక్ అందించడం విశేషం.  

More Related Stories