విజయ్ దేవరకొండకు నో చెప్పిన లోఫర్ బ్యూటీ..vijay
2020-03-06 02:29:56

విజయ్ దేవరకొండతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కాస్త క్రేజ్ తగ్గింది కానీ రెండేళ్ల కింద అయితే మనోడి కోసం బాలీవుడ్ బ్యూటీస్ కూడా పడి చచ్చిపోయారు. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి వాళ్లు కూడా తమకు విజయ్ అంటే ప్రాణం అని చెప్పారంటే ఈయన ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండతో నటించనని తెగేసి చెప్పింది. ఆమె మరెవరో కాదు దిశా పటానీ. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పూర్తిగా కేరాఫ్ బాలీవుడ్ అయిపోయింది. అక్కడే వరస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోలతో కూడా నటిస్తుంది దిశా పటానీ. ఫైటర్ సినిమా కోసం ముందు ఈ భామనే హీరోయిన్ గా తీసుకోవాలని పూరీ జగన్నాథ్ అనుకున్నాడు. కానీ ఈమె మాత్రం చేయలేనని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దిశా కాదన్న తర్వాతే అనన్య పాండేను తీసుకున్నాడు పూరీ. ఈమె కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అక్కడ వరస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతుంది. ఇలాంటి సమయంలో తెలుగు సినిమాల్లోకి పూరీ బ్రాండ్ తో వస్తుంది అనన్య. కచ్చితంగా ఫైటర్ సినిమాతో టాలీవుడ్ లో ఇమేజ్ సంపాదించుకుంటానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇదే ఏడాది ఫైటర్ విడుదల కానుంది. అన్నట్లు దీన్ని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నాడు పూరీ జగన్నాథ్.

More Related Stories