రామ్ ఇంటికి వారసుడు..ఆయనతో సినిమా ఫిక్స్ RAm Pothineni
2020-03-07 00:11:45

రామ్‌ పోతినేని ఇంటికి మరో వారసుడు వచ్చాడు. అదేంటి ఈయనకి పెళ్లి కాలేదు కదా మరి వారసుడు ఎవరా అనుకుంటున్నారా ? ఆయన మేనల్లుడు సిద్ధాంత్‌ పోతినేని. ‘వారసుడొచ్చాడు.. నా చిన్నారి మేనల్లుడు సిద్ధాంత్‌ పోతినేని’’ అంటూ ట్విటర్‌ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు రామ్‌. ఈ ఫొటోల్లో ఎనర్జిటిక్‌ హీరో తన మేనల్లుడితో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. 

ప్రస్తుతం రామ్ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్‌లో విజయవంతమైన ‘తడమ్’ సినిమాకు ఇది రీమేక్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజా సమాచారం మేరకు డైరెక్టర్ మారుతి రామ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్ననే మారుతి రామ్ ని కలసి కథ వినిపించాడట. ప్రస్తుతం వీరి మధ్య ఈ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు చెబుతున్నారు. రామ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెడ్ తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. 

More Related Stories