పవన్ కళ్యాణ్ పాట వచ్చేసింది.. బెస్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్..pink
2020-03-08 17:16:59

రెండేళ్ల తర్వాత వస్తున్నాడు కదా.. ఆ మాత్రం కచ్చితంగా అంచనాలు ఉంటాయి. అసలే పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేయికళ్ళతో చూస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి సమయంలో మగువ మగువ అంటూ ఉమెన్స్ డే కానుకగా తన సినిమా పాటను తీసుకొస్తున్నాడు పవన్. ఈ సాంగ్ యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. మొన్నటికి మొన్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ట్విట్టర్ ను షేక్ చేసింది. దేశంలోనే అత్యధికంగా షేర్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది వకీల్ సాబ్. ఇదిలా ఉంటే ఇప్పుడు మగువ పాట కూడా దుమ్ము దులిపేసేలా కనిపిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ల గొప్పతనం చెప్పేలా ఈ పాటను రాసాడు రామజోగయ్య శాస్త్రి. అందులోనే వాళ్లు పడే కష్టాలు.. వాళ్లపై జరిగే అఘాయిత్యాలు అన్నీ రచించాడు శాస్త్రి. కచ్చితంగా ఈ పాటతో మరోసారి సంచలనం సృష్టించేలా కనిపిస్తున్నాడు పవర్ స్టార్. ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై ఓ లాయర్ వచ్చి న్యాయం చేసే కథే వకీల్ సాబ్. పింక్ సినిమా రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుదల కానుంది.

 

More Related Stories