టాలీవుడ్ నిర్మాత కన్నుమూతtollywood
2020-03-08 19:20:46

తెలుగు ఇండస్ట్రీలో వరస విషాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా తెలుగు వారికీ మంచి మంచి సినిమాలు అందించిన ప్రముఖ నిర్మాత ఒకరు కన్నుమూసాడు. శ్రీ గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత సి వెంకట రాజు కన్నుమూశారని చెబుతున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో మరణించినట్టు చెబుతున్నారు. గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వెంకటేష్ హీరోగా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఘర్షణ లాంటి సినిమాలు వెంకట రాజు నిర్మించారు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన శ్రీమతి వెళ్లొస్తాకు కూడా ఈయనే నిర్మాత. ఈయన మృతి గురించి తెలుసుకున్న తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

More Related Stories