మరో బిజినెస్ మొదలు పెడుతున్న సూపర్ స్టార్ మహేష్..mb
2020-03-10 13:55:53

మ‌హేశ్ గురించి ముందే ఊహించాడేమో పూరీ జ‌గ‌న్నాథ్.. అందుకే 8 ఏళ్ళ ముందే బిజినెస్ మ్యాన్ సినిమా సూప‌ర్ స్టార్ తో చేసాడు పూరీ. ఇప్పుడు ఈ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇటు సినిమాలు.. అటు బిజినెస్ లో దూసుకెళ్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టాడు సూప‌ర్ స్టార్. హైదరాబాద్ లో ఉన్న అతిపెద్ద మల్టీప్లెక్స్ లలో  ఏఎంబి  కూడా ఉంది. 1600 పైగా సీటింగ్ కెపాసిటీతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించాడు సూపర్ స్టార్. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెట్టాడు. దాంతో పాటే క్లోతింగ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు సూపర్ స్టార్.

ఇక ఇప్పుడు కాస్మోటిక్స్, పర్ఫ్యూమ్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. తన పేరుతోనే ఒక బ్రాండ్ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాడు మహేష్ బాబు. ఇప్ప‌టికే 22 కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. తాజాగా కార్ దేఖో కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు సూపర్ స్టార్. ఇక పర్ఫ్యూమ్ బిజినెస్ కోసం ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు.

 

More Related Stories