బంగార్రాజులో చైతూ సమంతా---సంక్రాంతి టార్గెట్nag
2020-03-11 14:48:23

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ అనే పోలీస్ బ్యాక్ గ్రౌండ్ సినిమా చేస్తున్నాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కరోనా దెబ్బకి షూట్ ఆగినా ఆయన మరో సినిమాని లైన్ లో పెట్టేశారు. నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా” 2016లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన్నే ఫైనల్ చేశారట. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలెట్టారు. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది రోజున ‘బంగార్రాజు’ సినిమాని మొదలు పెట్టి జూన్ నుండి షూటింగ్ కి కూడా వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య, సమంతలు కూడా నటిస్తున్నట్టు చెబుతున్నారు. అంతే కాక ఈ సినిమాని జనవరి 13న రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.

More Related Stories