శిరీష్ సరసన పవన్ హీరోయిన్ Allu Sirish
2020-03-11 18:56:57

అల్లు వారి ఫ్యామిలీ నుండి రెండో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి కొన్నేళ్ళగా విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏడేళ్లలో ఆరు సినిమాల్లో హీరోగా నటించి రిలీజ్ చేసినా ఒక్క సినిమా కూడా గుర్తుపెట్టుకోదగిందని లేదు. మొన్న వచ్చిన ఏబీసీడీ కూడా శిరీష్‌ కు నిరాశే మిగిల్చింది. త‌దుప‌రి సినిమా ఏమీ ప్రకటించని శిరీష్ త్వ‌ర‌లోనే ఒక సినిమా స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు. 

జతకలిసే, విజేత చిత్రాల ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.  ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానుయెల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆమెను సంప్రదించారని, కథ కూడా ఆమెకు నచ్చడంతో అను ఓకే చేసిందని అంటున్నారు. అనూ ప్రస్తుతం పెద్ద బెల్లం బాబు సరసన నటిస్తోంది. నాని ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అను తక్కువ సమయంలోనే పవన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు టైం బాలేక సినిమాలు రావడం లేదు. మరి శిరీష్‌ సరసన ఆమె ఏమి చేస్తుందో చూడాలి మరి.

More Related Stories