సాయి ధరమ్ తేజ్ కెరీర్ కు పవన్ కళ్యాణ్ గైడెన్స్..Pawan Kalyan
2020-03-12 19:55:20

మెగా హీరోల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, బన్ని స్టార్ హీరోలు అయిపోయారు. వాళ్లకు ప్రత్యేకంగా ఇప్పుడు గైడెన్స్ అవసరం లేదు. వాళ్ళ సినిమాలు సొంతంగా చేసుకుంటారు. ఎవరి గైడెన్స్ తో వాళ్లకు పెద్దగా పని ఉండదు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం అలా కాదు. కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్న మెగా మేనల్లుడు.. ఆ తర్వాత వరుస డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను ఫ్లాపుల తర్వాత మళ్లీ 2019 ఈయనకు బాగా కలిసొచ్చింది. వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో రేస్ లోకి వచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. 

అయితే ఈయన కెరీర్ కు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి అండ దండలు లేవు అని ముందు నుంచి వినిపిస్తున్న మాట. మధ్యలో దిల్ రాజు కొన్ని సంవత్సరాలు మెగా మేనల్లుడిని పూర్తిగా దత్తత తీసుకున్నాడు. మళ్లీ ఆ తర్వాత దిల్ రాజు కంపౌండ్ నుంచి బయటికి వచ్చాక సాయిని వరుస పరాజయాలు వేధించాయి. అయితే ఈయన కెరీర్ ను ఎప్పటికప్పుడు మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ మానిటర్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మేనల్లుడి బాధ్యత ఈయన తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సాయి అంటే పవన్ కు చాలా ప్రేమ ఉంటుందని.. ఆయన కెరీర్ విషయంలో దర్శక నిర్మాతలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడని చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. 

తన తొలి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా విషయంలో కూడా సాయి ధరమ్ తేజ్ కు కావాల్సిన సూచనలు పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయని మెగా వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే మధ్యలో రాజకీయాల్లో బిజీగా ఉండి కొన్ని రోజులపాటు మేనల్లుడి కెరీర్ ను పెద్దగా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. మళ్లీ ఇప్పుడు సాయి కెరీర్ పై ఫోకస్ పెట్టాడు పవర్ స్టార్. తాజాగా దేవకట్టా దర్శకత్వంలో సాయి హీరోగా నటించబోయే సినిమా ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్ వచ్చాడు. సాధారణంగా బయట ఫంక్షన్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ మేనల్లుడి సినిమా కోసం మాత్రం వస్తుంటాడు. ఏదేమైనా కూడా అల్లుడి కోసం అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు పవర్ స్టార్. 

More Related Stories