షోకు యాంకర్ అయిపోయిన దర్శకుడు.. Tharun Bhascker
2020-03-14 16:54:18

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పటి దర్శకులు మాత్రం ఇదే చేస్తున్నారు. క్రేజ్ ఉన్నంత వరకు వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కసారి క్రేజ్ పోయిందంటే రెండో దారి చూసుకుంటున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఓ వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు నటుడిగా.. ఇంకోవైపు హోస్టులుగా కూడా మారిపోతున్నారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కూడా ఇదే చేస్తున్నాడు. 

పెళ్లి చూపులు సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్న ఈయన.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ చిత్రం తర్వాత మీకు మాత్రమే చెప్తా అంటూ హీరో కూడా అయ్యాడు తరుణ్. ఇక ఇప్పుడు ఓ షోకు యాంకర్ అయిపోయాడు. సెలబ్రిటీ టాక్ షోలా ఉండే దీనికి నీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ పెట్టారు. 

తాజాగా ఈ షోకు గెస్టుగా అనిల్ రావిపూడి కూడా వచ్చాడు. ఈయనతో తరుణ్ భాస్కర్ మాట ముచ్చట జరిపాడు. ఈ షో కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. ఈటీవీ ప్లస్ లో ఈ షో రాబోతుంది. మార్చ్ 14 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9 గంటలకు ఈ షో వస్తుంది. మరోవైపు దర్శకుడిగానూ కొనసాగుతున్నాడు ఈయన.. త్వరలోనే వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు తరుణ్ భాస్కర్. మధ్యలో ఇలా రెండో వైపు కూడా చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. 

More Related Stories