ఆయన పాడితే సినిమాకు హైప్.. సిధ్ శ్రీరామ్ హైలైట్..sid
2020-03-15 03:23:33

మీ సినిమాకు హైప్ కావాలా.. మీ సినిమా గురించే అంతా మాట్లాడుకోవాలా.. అయితే ఆ గాయకున్ని పట్టుకోండి.. కాస్త కష్టమైనా మీ సినిమాలో పాట పాడించుకోండి.. ఒక్కసారి ఆయన పాట విడుదలైతే రెండో రోజు నుంచి అంతా మీ సినిమా గురించే మాట్లాడుకుంటారు. ఆయనే సిధ్ శ్రీరామ్. అమృతం గొంతులో పోస్తే ఎంత మధురంగా ఉంటుందో తెలియదు కానీ.. ఆయన పాట వింటే మాత్రం అలాగే ఉంటుంది. నిజంగానే ఆ బ్రహ్మదేవుడు అతడి గొంతులో అమృతం కానీ పోసాడేమో అనిపిస్తుంది. ఆయన పాట వింటే చాలు ఏదో మాయ.. ఇప్పుడు తెలుగులో ఆ ఒక్కడి కోసం దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు వేచి చూస్తున్నారు. అతడే సిధ్ శ్రీరామ్. రెండు మూడేళ్లుగా సిధ్ పాడిన ప్రతీ పాట సంచలనమే. అన్నీ అద్భుతాలే. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో మగువ మగువ పాటతో మాయ చేసాడు ఈయన.

ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాట దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ లాంటి ప్రేక్షకులు మరిచిపోయిన హీరో సినిమాలో కూడా సిధ్ శ్రీరామ్ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మాయ పేరేమిటో అంటూ ఆయన పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలోనిది ఈ పాట. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిన్న సినిమాలకు కూడా సిధ్ శ్రీరామ్ పాట ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. పెద్ద సినిమాలు కూడా ఈయన గొంతు కావాలనుకుంటున్నారు. సిధ్ పాడితే చాలు తమ సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటారని నమ్ముతున్నారు. యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా గురించి తెలిసిందంటే కారణం ఈయన పాడిన నీలినీలి ఆకాశం పాటే. అలా ఈ మధ్య చాలా సినిమాలకు సేవియర్ అవుతున్నాడు సిధ్ శ్రీరామ్.

More Related Stories