రెచ్చిపోతున్న తల్లీ కూతుళ్లు.. ఆడుకుంటున్న నెటిజన్లు..surekha
2020-03-15 10:08:31

తెలుగు ఇండస్ట్రీలో సురేఖవాణి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న చిన్న సినిమాల్లోనే కాక పెద్ద సినిమాల్లోనూ ఉన్న పాత్రలే చేసింది. దానికి తోడు సీరియల్స్ లో కూడా నటించింది. ఇవన్నీ ఇలా ఉంటే ఈమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురితో కలిసి మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తూ నానా రచ్చ చేస్తుంది ఈ సురేఖ ఆంటీ. అయితే ఈ మధ్య ఈమె కుటుంబంలో అనుకోని విషాద ఘటన జరిగింది. సురేఖ వాణి భర్త అనారోగ్యంతో కన్నుమూసాడు. ఈయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈయన చనిపోయి కేవలం రెండు నెలలు కూడా కాకుండానే తల్లీకూతుళ్లు మళ్ళీ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు డాన్సు చేస్తుంటే నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె కళ్ళలో కానీ మొహంలో కానీ భర్త చనిపోయిన బాధలో ఏమాత్రం కనిపించడం లేదని.. పైగా కూతురుతో కలిసి డాన్స్ లు ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఏమాత్రం సిగ్గులేకుండా అలా డాన్సులు చేయడం ఏంటి అంటూ సురేఖవాణిని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై ఆమె మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికీ మామూలుగానే మునుపటి మాదిరిగా కూతురుతో కలిసి హాట్ డాన్సులు పోస్ట్ చేస్తుంది సురేఖ వాణి ఆంటీ. ఇది చూసిన వాళ్లు అమ్మో ఇంత తెగింపు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా భర్త చనిపోయిన తర్వాత కూడా ఇలా రెచ్చిపోవడం అంత సమంజసంగా లేదు అంటున్నారు విశ్లేషకులు కూడా. అయితే ఈ మధ్య కూతురుతో కలిసి దిగిన కొన్ని హాట్ ఫొటోలకి వచ్చిన కామెంట్లకి సురేఖ కాస్త ఘాటుగానే స్పందించింది. కచ్చితంగా కూతుర్ని పెంచే పద్ధతి ఇది కాదు అంటూ కామెంట్ చేస్తే దానికి ఆమె వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నీలాంటి వీధి కుక్కలు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ మైండ్ సెట్ కి హ్యాట్సాఫ్ అని సురేఖ వాణి నెటిజన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాంతో సురేఖవాణి పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదిగివచ్చిన కూతురుతో ఇలా అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేయడమే కాకుండా  మంచి చెప్పడానికి పోతే విమర్శిస్తారా అంటూ ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం సురేఖవాణి చెప్పిన దాంట్లో కూడా తప్పులేదన్న వాదనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కూతురుతో అలాంటి ఫోటోలు దిగడం మాత్రం మంచిది కాదని ఆమెకు బాహాటంగానే కొందరు సలహా ఇస్తున్నారు. అలాంటి ప్రైవేట్ ఫోటోలు ఉన్నప్పుడు దాచుకోవాలి కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అంటూ ఆమెకు హితవు పలుకుతున్నారు.

More Related Stories